శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mahabubnagar - Jan 24, 2021 , 00:32:30

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

  • అలుపెరుగని పోరాటయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌  :  జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్లటౌన్‌, జనవరి 23 : స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శనివారం జడ్చర్లలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వడ్ల వేణు, గోనెల రాధాకృష్ణ, బండారి సునీత, డాక్టర్‌ సదాశివయ్యను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాద య్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, మాజీ చైర్మన్‌ పిట్టల మురళి, సింగిల్‌విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నేతాజీ సేవా సంఘం సభ్యులు జీవన్‌ గుండప్ప, వేణుగోపాల్‌, రవిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత పాల్గొన్నారు.

నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలి

భూత్పూర్‌, జనవరి 23 : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌ అన్నారు. మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌లో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తాటికొండ గ్రామంలో నేతాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రామకృష్ణ, కోఆప్షన్‌ సభ్యులు అజీజ్‌, జాకీర్‌, యువజన సంఘం సభ్యులు ఆగిరి సత్యం, నర్సింహులు, ఫారూఖ్‌, సురేందర్‌గౌడ్‌, నాయకులు చెన్నమ్మ, ఎర్ర బాలప్ప, బాలస్వామి, నరేందర్‌ పాల్గొన్నారు. 

స్వాతంత్య్ర ఉద్యమ కిరణం నేతాజీ

మూసాపేట, జవనరి 23 : దేశ స్వాతంత్య్ర ఉద్యమ కిరణం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌ కొనియాడారు. మండలంలోని నిజాలాపూర్‌ గ్రామంలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ భీమయ్య, తిరుపతయ్య, రవి, సురేశ్‌, రాము, పీబీ శేఖర్‌, శ్రీను, రామలింగం, చిన్న శ్రీనివాసులు పాల్గొన్నారు. 

నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం

బాలానగర్‌, జనవరి 23 : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితం స్ఫూ ర్తిదాయకమని టీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ మండల అ ధ్యక్షుడు సుప్ప ప్రకాశ్‌ కోరారు. మండల కేంద్రంలో నేతా జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలునాయక్‌, ఏఎంసీ డైరెక్టర్‌ మల్లేశ్‌, సాయిలు, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

దేశభక్తిని చాటాలి

దేవరకద్ర రూరల్‌, జనవరి 23 : యువత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని చాటాలని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ అన్నారు. కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా డోకూర్‌ గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో.. 

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 23 : భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భారత్‌ వికాస్‌ పరిషత్‌ దక్షిణ భారత ప్రాంతీయ కార్యదర్శి పాండురంగం, రమేశ్‌, భూషణ్‌పాండే, చంద్రు డు, సంపత్‌, యాదిరెడ్డి, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, నారయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాజాపూర్‌ మండలంలో..

రాజాపూర్‌, జనవరి 23 : మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అడ్డాకుల మండలంలో..

మూసాపేట(అడ్డాకుల), జనవరి 23 : మండల కేంద్రంతోపాటు, కందూరు తదితర గ్రామాల్లో శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయన్న, మంజులభీమన్నయాదవ్‌, శ్రీకాంత్‌ ఉన్నారు.

నవాబ్‌పేట మండలంలో..

నవాబ్‌పేట, జనవరి 23 : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని మండల సర్పంచులు, నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు గోపాల్‌గౌడ్‌, సత్యం, యాదయ్యయాదవ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగయ్య, లక్ష్మారెడ్డి, లలితమ్మ, పావని, జంగయ్య, వెంకటే శ్‌, బొజ్జమ్మ, నాయకులు వీరసింహారెడ్డి, చందర్‌నాయక్‌, నర్సింహులు, మాన్యనాయక్‌, హన్మంతు, రమేశ్‌ తది తరులు పాల్గొన్నారు.

VIDEOS

logo