శనివారం 06 మార్చి 2021
Mahabubnagar - Jan 19, 2021 , 01:36:18

హోరాహోరీగా..

హోరాహోరీగా..

  • నెట్‌బాల్‌ టోర్నీ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • పది జిల్లాల క్రీడాకారులు హాజరు
  • పాలమూరులో అట్టహాసంగా నెట్‌బాల్‌ టోర్నీ
  • ప్రారంభించిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • బాలుర విభాగంలో విజేత పాలమూరు జట్టు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 18 : మ హబూబ్‌నగర్‌ జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక స్టేడియంలో నిర్వహించి న అండర్‌-19 రాష్ట్రస్థాయి జూనియర్‌ నెట్‌బాల్‌ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెద క్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖ మ్మం, ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాలకు చెం దిన 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 

క్రీడాభివృద్ధికి కృషి 

ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృ షి చేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు.  ప్రధాన స్టేడియం అన్ని విధాలా ఆధునీకరిస్తామని, ఇక్కడే క్రీడాకారులకు హాస్టల్‌ ఏ ర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధిం చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చామని చెప్పారు. క్రీడలతో శారీక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. క్రీడాకారులు చరుకుగా ఉంటారని, వారు అన్ని రంగాల్లో రాణిస్తారని గుర్తుచేశారు. జిల్లాలో ప్రతిభ గల క్రీ డాకారులకు కొదవలేదని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులకు అన్ని విధా లా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. జిల్లా లో మంచి క్రీడాకారులను వెలికితీసేందుకు క్రీ డాసంఘాలు, పీఈటీలు, కోచ్‌లు కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఫైనల్‌లో తలబడుతున్న మహబూబ్‌నగర్‌, ఖమ్మం జ ట్లను అభినందించారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ఒలింపిక్‌ సం ఘం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, యో గా సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఖాజాఖాన్‌, యోగా సంఘం కార్యదర్శి బాల్‌రాజ్‌, నెట్‌బాల్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సాదత్‌ఖాన్‌, వాలీబాల్‌ సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చెన్నవీరయ్య, కౌన్సిలర్లు రామ్‌, అనంతరెడ్డి, న ర్సింహులు, మోతీలాల్‌, కోచ్‌లు అరుణజ్యో తి, స్వప్న, జహీరుద్దీన్‌, షకీల్‌, అంజద్‌అలీ, విక్రమాదిత్యరెడ్డి, స్వప్న, రాణి పాల్గొన్నారు. 

విజేతలు వీరే.. 

స్టేడియం మైదానంలో జరిగిన రాష్ట్ర స్థా యి జూనియర్‌ నెట్‌బాల్‌ టోర్నీ హోరాహోరీ గా కొనసాగింది. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌, బాలికల విభాగంలో ఖమ్మం జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌, బాలుర విభాగం లో ఖమ్మం జట్లు రెండో స్థానంలో నిలిచా యి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు ఖమ్మంపై 21-16, బాలికల విభాగంలో జరిగిన మ్యా చ్‌లో ఖమ్మం జట్టు మహబూబ్‌నగర్‌పై 26-16 స్కోర్‌ తేడాతో గెలిచింది. మూడో స్థానంలో బాలుర విభాగంలో నల్లగొండ, వ రంగల్‌, బాలికల విభాగంలో వరంగల్‌, హై దరాబాద్‌ జట్లు సంయుక్తంగా నిలిచాయి.

VIDEOS

logo