బుధవారం 24 ఫిబ్రవరి 2021
Mahabubnagar - Jan 17, 2021 , 00:50:23

కరోనాకు చెక్‌ పెట్టేందుకే..

కరోనాకు చెక్‌ పెట్టేందుకే..

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తిమ్మాజిపేట, జనవరి 16 : కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకే శాస్త్రవేత్తలు టీకా రూపొందించారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతి, అదనపు కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని మోడీ ప్రసంగాన్ని వారు వీక్షించారు. ఈ సందర్భంగా తొలి టీకాను స్థానిక దవాఖానలో పనిచేస్తున్న కోడుపర్తి సబ్‌ సెంటర్‌ ఏఎన్‌ఎం ప్రమీలకు వేశారు. అనంతరం మరో 29 మందికి టీకా వేశారు. అనంతరం వారిని అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దవాఖాన ఆవరణ అందంగా అలంకరించారు. డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, అదనపు వైద్యాధికారి వెంకటదాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ అందించిన మాస్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ యాదవ్‌, తాసిల్దార్‌ సరస్వతి, ఎంపీడీవో కరుణశ్రీ, సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీ లీలావతి పాల్గొన్నారు.


VIDEOS

logo