మంగళవారం 09 మార్చి 2021
Mahabubnagar - Jan 17, 2021 , 00:50:21

కరోనాపై దేశాన్ని అప్రమత్తం చేసిన కేసీఆర్‌

కరోనాపై దేశాన్ని అప్రమత్తం చేసిన కేసీఆర్‌

  • దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మూసాపేట/భూత్పూర్‌, జనవరి 16 : కరోనా విషయంలో ప్రధాని మోడీనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్రమత్తం చేశారని, నిరవధిక లాక్‌డౌన్‌ అమలు చేసినందుకే రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జానంపేట, భూత్పూర్‌ పీహెచ్‌సీల్లో ప్రధాని ప్రసంగాన్ని ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ సీతారామారావుతో కలిసి ఎమ్మెల్యే వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. జానంపేటలో 30 మందికి, భూత్పూరులో 30 మంది కి టీకా వేశామని డాక్టర్లు స్వేత, సంధ్యా కిరణ్మయి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ వెంకట్రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ వైరస్‌కు టీకా వ చ్చిందని ఎవ రూ నిర్లక్ష్యం చే యొద్దని, నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాంత్‌, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, కళావతి కొండయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూరు బస్వరాజ్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, తాసిల్దార్లు మంజుల, చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్ని, కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, సర్పంచులు, శ్రీనివాసులు, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్‌, విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్‌, ఎంపీటీసీ ఆంజనేయులు, కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ జమీర్‌, సత్తార్‌, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo