అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- బీజేపీ నుంచి టీఆర్ఎస్లో 100 మంది చేరిక
మహబూబ్‌నగర్, జనవరి 16 : రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన 100 మందికిపైగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే అడుగులు వేస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని చెప్పారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎండీ వహీద్ పాషా, బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ నిరంజన్, నజీర్, ఖదీర్పాషాతోపాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో హన్వాడ ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణకర్గౌడ్, కృష్ణయ్యగౌడ్, శేఖర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ కస్టడీ
- భారీ ఆఫర్‌కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !