వాటా డబ్బులు ఇవ్వనందుకే..

- అన్నను హతమార్చేందుకు కుట్ర
- తమ్ముళ్ల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు : డీఎస్పీ శ్రీధర్
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 15 : భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇవ్వకపోవడంతో అన్నను హత్య చేసేందుకు తమ్ముళ్లే కుట్ర పన్నారు. మాటువేసి స్కూటీపై వెళ్తున్న అన్న కుటుంబానికి వెనుకనుంచి వా హనంతో ఢీకొట్టగా వదిన చనిపోగా.. అన్న, వారి కూతురు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించా రు. హత్యకేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. బాలానగర్ మండ లం గొల్లపల్లిలో అన్నదమ్ములు ఆకుల భీమ య్య, ఆకుల నర్సయ్యకు 22.40 ఎకరాల వ్య వసాయ భూమి ఉన్నది. భీమయ్యకు నలుగు రు కూతుళ్లు ఉండగా.. ఈ భూమిలో 2.40 ఎకరాలను చాకలి పెంటయ్యకు రికార్డులు లే కుండానే ఇచ్చారు. మిగితా భూమిని ఆకుల నర్సయ్య కొడుకులు తమ పేరిట చేసుకున్నా రు. అయితే ఇటీవల ఆకుల భీమయ్య కూతు ళ్ల కొడుకులు సుప్పు యాదయ్య. మున్నూరు నర్సింహులు, కోడిగంటి యాదయ్య, మహేశ్ కలిసి చాకలి పెంటయ్యకు ఇచ్చిన భూమి వెనక్కి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కేసు వేశా రు. కాగా చాకలి పెంటయ్యకు ఇచ్చిన భూమి లో 1.04 ఎకరాలను సుప్పు యాదయ్య ఇతరులకు రూ.80 లక్షలకు విక్రయించాడు. వ చ్చిన మొత్తం డబ్బులు ఎవరికీ ఇవ్వకుండా తనే తీసుకున్నాడు. మిగితా ముగ్గురు ఇందు లో వాటా కావాలని యాదయ్యపై ఒత్తిడి తె చ్చారు. ఈ క్రమంలో గత నవంబర్ 28న యాదయ్య తన ఇంట్లో శుభకార్యం చేయగా.. హాజరైన మిగితా ముగ్గురు డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఇవ్వనని ఖరాఖండిగా చెప్పడంతో యాదయ్యను హత్యచేయాలని నిర్ణయించి పథకం పన్నారు. ఈ క్రమం లో ఏనుగొండకు చెందిన మున్నూరు నర్సింహులు బొలేరో వాహనం కొనుగోలు చేసి అ వకాశం కోసం ఎదురుచూశాడు. ఈనెల 10న యాదయ్య తన భార్య శైలజ, కూతురుతో కలిసి నవాబ్‌పేట మండలం కారుకొండలో శు భకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా.. నర్సింహులు బొలేరోతో స్కూటీని వెంబడించాడు. మిగతా ఇద్దరు యాదయ్య, మహేశ్ పల్సర్‌పై గుండేడు శివారులో కాపు కాశారు. వాహనం తో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాల ని.. లేదంటే హత్య చేయాలని వేట కొడవలిని సిద్ధంగా ఉంచారు. అనుకున్న ప్రకారం మా చారం సమీపంలో నర్సింహులు బొలేరోతో వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి భార్య శైలజ మృతిచెందగా, యాదయ్య, అతడి కూతురు గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి శుక్రవారం నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి బొలేరో, పల్సర్ వాహనాలతోపాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ, ఎస్సై, సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో జడ్చర్ల సీఐ శివకుమార్, బాలానగర్ ఎస్సై కృష్ణయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్