అర్హులందరికీ ‘డబుల్' ఇండ్లు

- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- లబ్ధిదారులకు లక్కీడిప్ ద్వారా కేటాయింపు
- మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్, జనవరి 13 : అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి దివిటిపల్లి వద్ద నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లకు సంబంధించి లక్కీడిప్ ద్వారా 100మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ధి పనులను చేపట్టి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఒకప్పుడు వలసలు, వెనుకబడిన జిల్లాగా పేరు పొందిన పాలమూరు..ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తూ రూపురేఖలను మార్చుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవవార్, మహబూబ్‌నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, డీటీ క్రాంతికుమార్‌గౌడ్ ఉన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 13 : మహబూబ్‌నగర్ 21వ వార్డులోని బీకే రెడ్డి కాలనీలో రూ.32లక్షల 50వేలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం దొడ్డలోనిపల్లిలో క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బోయపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలను పరిశీలించారు.
తాజావార్తలు
- అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్ సూర్జేవాలా
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్‌లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైనట్లేనా..?
- బ్లడ్‌లో హై ఒమెగా-3 ఫ్యాట్‌తో నో కొవిడ్ రిస్క్
- ‘సీఎం అయిన మీకు.. అరెస్ట్ వారెంట్ ఎవరిస్తారు..’
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- 'చెరుకు రసం' వల్ల ఎన్నో లాభాలు..