ప్రపంచవ్యాప్తంగా సామాజిక జీవనంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. చదువుకునే పిల్లలను బడికి దూరం చేసి వీధిపాలు చేసింది. దీంతో కరోనా కాలంలో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాల్యం అంటే ప్రతి వ్యక్తికి మధురానుభూతిగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. కానీ భావి భారత భాగ్య విధాతలు బాల కార్మికులై బాల్యాన్ని కోల్పోతున్నారు. దేశంలో బడిలేని గ్రామం ఉంటుందేమో కానీ బాల కార్మికులు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
బాలలు కార్మికులుగా మారడం వల్ల వారి శారీరక, మానసిక, ఆరోగ్య పరిస్థితులు దిగజారుతాయి. కార్మికులుగా పనిస్థలాల్లో లైంగి క వేధింపులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తం గా ఇప్పటికీ 15.2 కోట్ల బాలకార్మికులు ఉ న్నారు. ఇందులో 7.2 కోట్ల బాలలు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలో 10 మంది బాలల్లో ఒకరు బాలకార్మికులుగా ఉన్నారు. కొవిడ్-19 కారణంగా పేదరికం పెరగడం, పాఠశాలలు మూసివేయడంతో బాలకార్మికులు పెరుగుతున్నారు. బాల కార్మికుల్లో 71 శాతం మంది వ్యవసాయరంగంలో, 17 శాతం మంది సేవల రంగంలో, 12 శాతం బాలలు పరిశ్రమల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002వ నుంచి ఏటా జూన్ 12న అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినంగా పాటిస్తున్నది. (అంతర్జాతీయ కార్మిక సంస్థ) బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేస్తున్నది. ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు, పౌరసంఘాలకు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తుంది. 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నది.
2019వ సంవత్సరాన్ని బాల లు ఉండాల్సింది పని ప్రదేశంలో కాదు, కలల ప్రపంచంలో అనే నినాదంతో జరుపుకొన్నాం. 2020ని ‘కొవిడ్-19; ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్, నౌ మోర్ దెన్ ఎవర్’గా జరుపుకొన్నాం. 2021ని ‘యాక్ట్ నౌ; ఎండ్ చైల్డ్ లేబర్’గా జరుపుకొంటున్నాం. బాలకార్మిక వ్యవ స్థ నిర్మూలనకు శిశు సమగ్ర అభివృద్ధి, ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్, సర్వశిక్షా అభియాన్, బాలకార్మిక వ్యవస్థపై వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర, జిల్లాస్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిష్కరిస్తుంది. 20 15లో ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం చేపట్టారు.
కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో ప్రజల వృత్తి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆర్థికస్థితి క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలకార్మికులు పెరిగే అవకాశం ఉన్నది. దీనిని నివారించడానికి పౌర సమాజం, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
-శివరాజం బొట్ల