మంగళవారం 26 జనవరి 2021
Mahabubnagar - Dec 06, 2020 , 03:01:14

భక్తిభావాన్ని పెంపొందించాలి

భక్తిభావాన్ని పెంపొందించాలి

  • విగ్రహ ప్రతిష్ఠాపనలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హన్వాడ: ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో శ్రీ శివాంజనేయ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్న చెన్నయ్య, ఎంపీటీసీ పెద్ద చెన్నయ్య, ఉప సర్పంచ్‌ లక్ష్మమ్మ, దేవాలయం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మయ్య, రవీందర్‌, చెన్నయ్య పాల్గొన్నారు.

అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు 

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని వెంకటాద్రినగర్‌లో శ్రీ అభయాంజనేయస్వామి అష్టమ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దైవ చింతన ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొరమోని వెంకటయ్య, కౌన్సిలర్‌ పటేల్‌ ప్రవీణ్‌ ఉన్నారు. logo