గురువారం 28 జనవరి 2021
Mahabubnagar - Dec 05, 2020 , 01:02:58

కొనుగోళ్ల సంబురం

కొనుగోళ్ల సంబురం

  •  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,14,232  ఎకరాల్లో వరి సాగు
  •  1,99,023 మెట్రిక్‌ టన్నుల ధాన్యం  దిగుబడి అంచనా
  •  ఇప్పటివరకు 22,122.28 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి.  పాలమూరు జిల్లాలో 1,14,232 ఎకరాల్లో వరి సాగైంది. 1,99,023 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. 194 కేంద్రాల ద్వారా ఇప్పటికే 22,122.28 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కలెక్టర్‌ వెంకట్రావు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మద్దతు ధర లభిస్తుండటం, కొనుగోలు చింత తీరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

- మహబూబ్‌నగర్‌


మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సంబురం ఊపందుకున్నది. ఈ ఏడాది రికార్డు స్థా యిలో వర్షపాతం నమోదు కావడంతో వరిని అ ధికంగా సాగు చేశారు. గ్రామాల్లోనే ధాన్యం కొ నుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చ ర్యలు తీసుకున్నది. పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పా రదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు కలెక్టర్‌ ఎస్‌ వెం కట్రావు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మ హబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 1,14,232 ఎకరాల్లో వరిని రైతులు సాగుచేశారు. 1,99,023 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. 194 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 22,122.28 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మహబూబ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 9,389.40, జడ్చర్ల డివిజన్‌లో 4,135.52, దే వరకద్రలో 8,598.36 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేశారు. 

ఇదిలా ఉండగా, ధాన్యంలో చెత్తాచెదారాన్ని పరిగణలోకి తీసుకోవడంలో భాగంగా ఎంత పడితే అంత తీసి వేయకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదాహరణకు కిలో ధాన్యం తీసుకుని చదరాలి. అందులో ఎంత మేరకు తరుగు వచ్చిందన్నది పరిశీలించాలి. దానిని పరిగణలోకి తీసుకుని రైతు పండించిన ధాన్యంలో తరుగు తీసివేయాలని.., ఎంత పడితే అంత తీసివేయొద్దని కలెక్టర్‌ సూచించారు. 

ఇబ్బందుల్లేకుండా కొనుగోలు..


రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామానికి వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రైతులు సంబంధిత అధికారులను ఆశ్రయించొచ్చు. ధాన్యాన్ని రైతులు పరిశుభ్రంగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయంను ప్రతి రైతూ అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలి. 

- ఎస్‌ వెంకట్రావు, కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌ 

తాజావార్తలు


logo