ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచాలి

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్ : ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. శుక్రవారం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో పాలెం వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కూలీ ల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నదని తెలిపారు. కూలీల కొరతను అధిగమించేందుకు యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో మార్పును కోరుతూ అన్నాసాగర్ గ్రా మంలో ఈనెల 7న ఆల శశివర్ధన్‌రెడ్డి పొలంలో ప్రయోగాత్మకంగా వరినాటే యంత్రంతో వ్యవసాయం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వరినాట్లు వేసే యం త్రంతోపాటు, కలుపు తీసే యంత్రం, వరికోత యంత్రం, ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలను రైతులకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు శాస్త్రవేత్తలు సహకరించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్త రాజమణి, హార్టికల్చర్ అధికారి మహేందర్ ఉన్నారు.
బాధితుడికి పరామర్శ
అమిస్తాపూర్ గ్రామానికి చెం దిన నర్సింహులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల.. దవాఖానకు వెళ్లి నర్సింహులును పరామర్శించారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకుడు సాయిలు ఉన్నారు.
సబ్సిడీపై యంత్రాలు మంజూరు చేయాలని వినతి
మండలంలోని మద్దిగట్ల గ్రామానికి సబ్సిడీపై వరినాట్లు వేసే యంత్రం, కలుపు తీసే యంత్రం మంజూరు చేయాల ని కోరుతూ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే ఆలకు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి ఎంజీకేఎల్ఐ కాలువ నుం చి సాగునీరు అందుతుండడంతో 100 ఎకరాల్లో పంటసా గు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్సిడీపై అధునాతన యంత్రాలను మంజూరు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉం టుందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పం దించారు. కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు అజీజ్, నాయకులు సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సదానంద్‌గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం