గురువారం 21 జనవరి 2021
Mahabubnagar - Dec 05, 2020 , 01:03:01

ప్రేమ, ఆప్యాయతలకు నిలయం

ప్రేమ, ఆప్యాయతలకు నిలయం

  • మహబూబ్‌నగర్‌ మట్టిలోనే ప్రత్యేకత
  • పట్టణాభివృద్ధికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృషి
  • వీహెచ్‌పీ ప్రాంత ప్రతినిధి లక్ష్మారెడ్డి
  • ఘనంగా 130వ ఆవిర్భావ దినోత్సవం

మహబూబ్‌నగర్‌ టౌన్‌: మహబూబ్‌నగర్‌ అంటే ప్రేమ, ఆప్యాయతలకు నిలయమని విశ్వహిందూ పరిషత్‌ ప్రాంత ప్రతినిధి పటోళ్ల లక్ష్మారెడ్డి అన్నా రు. ఆరో నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహదూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవా రం ఆర్‌అండ్‌బీలో 130వ మహబూబ్‌నగర్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మారెడ్డితోపాటు పట్టణ ప్రముఖులు హాజరై మాట్లాడారు.

ఆంగ్లేయుల పరిపాలనలో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని బంగారుపక్షి అనేవారని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌ మట్టిలో ప్రత్యేకత ఉన్నదని, ఉద్యోగరీత్యా ఎంతోమంది వచ్చి స్థిరపడ్డారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పట్టుదల గల వ్యక్తి అని, పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మహబూబ్‌ అలీఖాన్‌ బహదూర్‌ ఫౌండేషన్‌కు తమవంతు సహకారం ఉంటుందని తెలిపారు. మహబూబ్‌ అలీఖాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ రహీం మాట్లాడుతూ సిరిసిల్ల కంటే మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

ఎప్పుడూ జరగని అభివృద్ధి జరుగుతున్నదని గుర్తుచేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ హిందూ, ముస్లింలు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని గుర్తుచేశారు. ఏటా ఆవిర్భావ వేడుకలు నిర్వహించి జిల్లా చరిత్రను తెలియజేయడంపై రహీంను అభినందించారు. అనంతరం పలువురు పాత్రికేయులు, వివిధ రంగాల వారిని సన్మానించి, కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల, సంఘాల నాయకులు ఎస్‌ఎం ఖలీల్‌, ఫారుఖ్‌ హుస్సేన్‌, మోసీన్‌ఖాన్‌, సమద్‌ఖాన్‌, నూరుల్‌హసన్‌,  ఖుద్దూస్‌ బేగ్‌, రఫీక్‌ పటేల్‌, ఖుత్బుద్దీన్‌, మీర్‌ షోయబ్‌అలీ, సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo