గడువు ముగిసింది

- ముగిసిన డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు
- 16,018 మంది విద్యార్థుల దరఖాస్తులు
- ఆన్లైన్లో కొనసాగుతున్న ‘దోస్త్' ప్రక్రియ
- జూనియర్ కాలేజీల్లో చేరికకు గడువు పెంపు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గ డువు గురువారంతో ముగిసింది. 20 20-21కిగానూ ఆగస్టు 20వ తేదీన దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయగా.., గురువారం వరకు అడ్మిషన్లు కొనసాగాయి. నాలుగు ఫేజ్‌లలో అవకాశం కల్పించగా.., 16,018 మంది విద్యార్థు లు దరఖాస్తు చేసుకున్నారు. పీయూ పరిధిలో మ హబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాం బ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో 87 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో 61 ప్రైవేట్, 20 ప్రభుత్వ, మూడు సాంఘిక సంక్షేమ గురుకుల, మూడు గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో నాలుగు ఫేజ్‌లకు కలిపి వివిధ కోర్సుల్లో మొత్తం 16,018 మంది విద్యార్థు లు దరఖాస్తులు చేసుకున్నారు. ఐదో ఫేజ్ ఉన్నందున దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. దోస్త్ ప్రకియ ఆన్లైన్లో కొనసాగుతున్నందున పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమ యం ఉంది.
ఇంటర్ అడ్మిషన్లకు మరోసారి అవకాశం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ ప్ర కియకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కో సం సెప్టెంబర్ 16 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 19 ప్రభుత్వ జూనియర్ క ళాశాలల్లో 4,793 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కు దరఖాస్తులు చేసుకొని అడ్మిషన్లు పొందా రు. ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్‌కు దీటుగా వసతులు కల్పించడం, బోధ న వసతులు సమకూర్చడం, పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, ఉచితంగా పాఠ్యపుస్తకా లు, దుస్తులు అందిస్తుండడంతో విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్య ను అందించాలనే తపనతో గురుకుల క ళాశాలలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కళాశాలల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కళాశాలలో తరగతి గదుల కొరత, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, సకల వసతులు కల్పించడంతో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ కు దీటుగా బలోపేతం చేయడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2020-21కి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 4,793 మంది, 13 సాంఘిక సంక్షేమ, గురుకుల కళాశాలల్లో 1,484 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ప్రభుత్వ కళాశాలలతోపాటు రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ అవకాశం ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ఫొటో, సంతకాలను సేకరించి 10వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
- వెంకటేశ్వర్లు, డీఐఈవో, మహబూబ్‌నగర్
ఐదో ఫేజ్ కొనసాగుతున్నది..
పాలమూరు విశ్వవిదాలయం పరిధిలో 87 కళాశాలల్లో కలిపి నాల్గో ఫేజ్ వరకు 16,018 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదో ఫేజ్ కొనసాగుతున్నందున ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నది. గురువారంతో దోస్త్ ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
- కిశోర్, దోస్త్ జిల్లా సమన్వయకర్త, మహబూబ్‌నగర్
తాజావార్తలు
- ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
- నాలుగు వేళ్లతోనే బ్యాట్ పట్టుకోవాల్సి వచ్చింది: పుజారా
- ఫడ్నవీస్ మెట్రో ప్రయాణం : మాటల మంటలు
- ఢిల్లీలో చక్కదిద్ది బెంగాల్ గురించి ఆలోచించండి: మమత
- బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు
- మోడ్రన్ మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించండి
- స్మారకంగా జయలలిత ఇల్లు.. ఆవిష్కరించిన సీఎం పళని
- తైవాన్‌కు స్వతంత్రం అంటే యుద్ధమే.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్‌తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు