ఆదివారం 17 జనవరి 2021
Mahabubnagar - Dec 03, 2020 , 02:07:05

స్వచ్ఛ్చ భారత్‌, విద్యాలయ అమలు తీరు భేష్‌

స్వచ్ఛ్చ భారత్‌, విద్యాలయ అమలు తీరు భేష్‌

  • వీసీలో యూనిసెఫ్‌ ప్రతినిధి మజుందార్‌ 

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో స్వచ్ఛభారత్‌, స్వ చ్ఛ విద్యాలయ అమలు తీరు భేష్‌గా ఉందని యూనిసెఫ్‌ ప్రతినిధి మజుందార్‌ అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి దేశంలోని ఆరు రాష్ర్టాల నుంచి ఎంపిక చేసిన నల్గురు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలతో నిర్వహించిన కాంక్లేవ్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ను ఏపీ గవర్నర్‌ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ ప్రతినిధి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ముందుకు సాగడం సంతోషకరంగా ఉంద ని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు ప్రజలకు మంచి జరిగేలా ఉన్నాయని తె లియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ పరిశుభ్రత, టాయిలెట్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి రూ. కోటి 51 లక్షలను సేకరించామన్నా రు. జిల్లా వ్యాప్తంగా 1184 అంగన్‌వాడీ కేంద్రా ల్లో 432 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో టాయిలెట్లను నిర్మించామన్నా రు. 336 మంది మహిళలకు మేస్త్రీ పనుల్లో శిక్షణ ఇచ్చి పనులు చేయించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.