ఆదివారం 17 జనవరి 2021
Mahabubnagar - Dec 03, 2020 , 02:07:01

ఆన్‌లైన్‌ క్లాసులు వినాలి

ఆన్‌లైన్‌ క్లాసులు వినాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ :  విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను క్రమం తప్పకుండా వినాలని మోమిన్‌వాడీ ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్‌ జీహెచ్‌ ఎం అబ్దుల్‌ మన్నాన్‌ తెలిపారు. బుధవారం మోమిన్‌వాడీ, శివశక్తినగర్‌లో విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షించారు. విద్యార్థులకు సందేహాలు వస్తే సంబంధిత ఉపాధ్యాయులకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అబ్దుల్‌హై, సీఆర్పీ మొ గులయ్య, జహీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.