గురువారం 21 జనవరి 2021
Mahabubnagar - Dec 02, 2020 , 02:33:59

పరిసమాప్తం

 పరిసమాప్తం

  • నదీహారతితో తుంగభద్ర పుష్కరాలకు ముగింపు
  • విజయవంతం చేసిన ప్రభుత్వం
  • చివరిరోజు 56,194  మంది పుష్కరస్నానం
  • ఇప్పటివరకు 4,09,981  మంది భక్తుల హాజరు

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/అయిజ : పవిత్ర తుంగభద్ర పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు మంగ ళవారం రాత్రి వేదపండితులు నదీహారతితో ముగింపు ప లికారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో అలంపూర్‌ ని యోజకవర్గంలోని అలంపూర్‌, పుల్లూరు, రాజోళి, వేణి సోంపురం పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెలంగా ణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి సైతం భ క్తులు భారీగా తరలివచ్చారు. స్నానమాచరించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయ త్వం చెందారు. ఘాట్లకు వచ్చిన భక్తులు నది లో పుణ్య స్నానాలు ఆచరించి, నదిలో దీపా లు వదిలారు. వాయనాలు సమర్పించారు. పి తృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.

నదీతీ ర ప్రాంతాల్లో వెలిసిన బాల బ్రహ్మేశ్వరస్వామి, పంచలింగాల ఆలయం, వైకుంఠ నారాయస్వా మి, సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు నదీ హారతి కార్యక్రమానికి ఎ మ్మెల్యే అబ్రహం, జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మ న్‌ రవిప్రకాష్‌గౌడ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, కలెక్టర్‌ శృతి ఓఝా, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలను ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వహించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సఫలీకృతమయ్యారు. జిల్లాలోని చివరిరో జు నాలుగు ఘాట్ల లో 56,194 భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు. అలంపూర్‌లో 21,512, పుల్లూరులో 13,786, రాజోళిలో 15,98 6, వేణిసోంపురంలో 4,910 మంది భక్తులు పు ష్కర స్నానాలు చేయగా, పన్నెండు రోజులుగా 4,09,981 మంది భక్తులు స్నానాలు చేశారు. కాగా, ఆయా శాఖల వారీగా పుష్కరాలకు రూ.2,06,88,016 ఖర్చు చేసినట్లు నోడల్‌ అధికారి, గద్వాల ఆర్డీవో రాములు తెలిపారు. 

యంత్రాంగానికి  మంత్రి అభినందనలు..

పుష్కరాలను విజయవం తం చేసినందుకు జోగుళాం బ గద్వాల జిల్లా యంత్రాంగాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అ భినందించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో అన్ని పు ష్కరాలు విజయవం తం చేశామని ప్రకటనలో తెలిపా రు. పుష్కరాలు విజయవంతం చేయడంలో సహరించిన స్థానిక మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎ మ్మెల్యే అబ్రహం, కలెక్టర్‌ శృతి ఓఝా, ఎస్పీ రంజన్‌ ర తన్‌ కుమార్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కు మార్‌ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. 

దిగ్విజయంగా పుష్కరాలు

అలంపూర్‌ : పుష్కరాలు దిగ్విజయంగా ముగిశాయని దేవాదాయ కమిషనర్‌ అనీల్‌కుమార్‌ తెలిపా రు. మంగళవారం రాత్రి తుంగభద్రమ్మకు వాయ నం, సారెను సమర్పించారు. మంగళహారతితో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు తుంగభద్ర నదికి పూజ, 9 గంటలకు జలాభిషేకం, 10 గంటలకు నదీజలాలతో స్వామి, అ మ్మవారి ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ, యాగశాలలో చం డీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. 12 గంటలకు మ హాపూర్ణాహుతి, సాయంత్రం 5:30కు నదీమతల్లికి మహా మంగళనీరాజనం, రాత్రి 7 గంటలకు తుంగభద్ర మాతకు మూసి వాయనం, సారె సమర్పణ కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఏఎస్పీ కృష్ణ, ఏసీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


logo