గురువారం 21 జనవరి 2021
Mahabubnagar - Dec 02, 2020 , 02:03:30

ఉద్యోగాల కల్పనలో మోడీ సర్కారు విఫలం

ఉద్యోగాల కల్పనలో మోడీ సర్కారు విఫలం

ఆత్మకూరు : నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో ప్రధాని మో డీ సర్కారు విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు కో ట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఉత్తర ప్రఘల్భాలు పలికిన మోడీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా కల్పించకపోవడం విచారకరమన్నారు. వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పట్టణానికి చెందిన నవీన్‌, చిట్టిబాబు, పవన్‌, శివ, స్వరాజ్‌, శరత్‌, ఉదయ్‌ డీవైఎఫ్‌ఐలో చేరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మహమ్ముద్‌, అమరచింత మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపి, శ్రీహరి, అజయ్‌, వెంకటేశ్‌, రమేశ్‌, ఎస్‌ రాజు, రాజు పాల్గొన్నారు. 


logo