గురువారం 28 జనవరి 2021
Mahabubnagar - Dec 01, 2020 , 05:56:06

రైతులు దరఖాస్తు చేసుకోవాలి

రైతులు దరఖాస్తు చేసుకోవాలి

గోపాల్‌పేట : రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వారి సొంత పొలాల్లో కల్లాలు నిర్మించుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ, బీసీ, ఓసీలకు 90 శాతం రాయితీ ఉంటుందన్నారు. అవసరమైన రైతులు దరఖాస్తు ఫారంతోపాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఉపాధి హామీ జాబ్‌ కార్డు జిరాక్స్‌లతో ఏఈవోను, పంచాయతీ కార్యదర్శినిగాని సంప్రదించాలని ఆయన కోరారు.logo