గురువారం 28 జనవరి 2021
Mahabubnagar - Dec 01, 2020 , 05:56:06

పాట చిత్రీకరణ

పాట చిత్రీకరణ

ఆత్మకూరు : ఉమ్మడి జిల్లా ఆరాధ్యదైవం పేదల ఇలవేల్పు కురుమూర్తి స్వామి చరిత్రపై ఆత్మకూరు కళాకారుల బృందం పాట చిత్రీకరణ ప్రారంభించింది. సోమవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని కురుమూర్తి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి షూటింగ్‌ను ప్రారంభించారు. దేవస్థానం చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై షూటింగ్‌ను ఆరంభించారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన డ్యాన్స్‌మాస్టర్‌ బాలు తన సొంత ప్రొడక్షన్‌లో యూట్యూబ్‌ ఛానల్‌ను నెలకొల్పాడు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కుర్నిసుదీప్‌ సంగీత సారథ్యంలో రూపొందించిన కురుమూర్తి స్వామి పాటపై బాలు నృత్యరీతుల్ని సమకూర్చారు. భక్తిభావంతో కురుమూర్తి స్వామి ప్రత్యేకతను చాటుతూ సాగే పాటలో మండలంలోని జూరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు నటిస్తున్నారు. బాలు స్టూడియోస్‌లో నిర్మిస్తున్న ఈ పాట సక్సెస్‌ కావాలంటూ దేవస్థాన మండలి, ఈవో శ్రీనివాస్‌ కోరారు. 
logo