ఆదివారం 17 జనవరి 2021
Mahabubnagar - Dec 01, 2020 , 05:56:06

ఆన్‌లైన్‌ యోగా టోర్నీకి క్రీడాకారుల ఎంపిక

ఆన్‌లైన్‌ యోగా టోర్నీకి క్రీడాకారుల ఎంపిక

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : రాష్ట్రస్థాయి యోగా టోర్నీలో పాల్గొనే జిల్లా జట్లను సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా ఎంపికచేశారు. ఈ సందర్భంగా జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాములు, బాల్‌రాజ్‌ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 4న జరుగనున్న రాష్ట్రస్థాయి ఆన్‌లైన్‌ యోగా టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులకు కొదువలేదని, ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించారని గుర్తుచేశారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభచాటి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాక్షించారు. ఎంపిక కార్యక్రమంలో రమేశ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, సూర్యప్రకాశ్‌, మణికంఠ, మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జట్టు వివరాలు

బాలుర విభాగంలో..: 

అండర్‌10-12లో మధు, యోగేశ్వర్‌, తిరుపతి, వరుణ్‌, శివ. అండర్‌12-14లో ప్రవీణ్‌, విశాల్‌, సూరజ్‌, భాను, చైతన్య. అండర్‌14-16లో రాహుల్‌నాయక్‌, అజిత్‌, రంజిత్‌, మల్లేశ్‌, గణేశ్‌. అండర్‌ 16-18లో సాగర్‌, రాముడు, లక్ష్మణ్‌. అండర్‌ 18-21లో నాగరాజు, సతీశ్‌, చంద్రశేఖర్‌.

అండర్‌ 21-25లో దేవేందర్‌, మణికంఠ.

బాలికల విభాగంలో...

అండర్‌ 8-10లో యస్విత్‌. అండర్‌10-12లో కీర్తన.

అండర్‌14-16లో నందిని.

35 సంవత్సరాల మహిళా విభాగంలో 

వనజారెడ్డి ఎంపికయ్యారు.