గురువారం 04 మార్చి 2021
Mahabubnagar - Nov 30, 2020 , 02:35:07

గ్రేటర్‌లో ‘చిట్టెం’ విస్తృత ప్రచారం

గ్రేటర్‌లో ‘చిట్టెం’ విస్తృత ప్రచారం

  • ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్‌ వాసులు

మక్తల్‌ రూరల్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని రాంనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అ భ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి గెలుపు కోసం ఆదివారం మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాం నగర్‌ డివిజన్‌లో అభ్యర్థితో కలిసి టీఆర్‌ఎస్‌ మక్తల్‌ మండల కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రేటర్‌ ఎన్నికల్లో నగర మేయర్‌ పీఠాన్ని మళ్లీ టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాంనగ ర్‌ డివిజన్‌లో నివాసిస్తున్న మక్తల్‌ వాసులు కొందరు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చే రారు. కార్యక్రమంలో మక్తల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నరసింహ్మగౌడ్‌, మక్తల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు మొగులప్ప, జెగ్గలిరాములు, మార్కెట్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. 


VIDEOS

logo