ఆదివారం 24 జనవరి 2021
Mahabubnagar - Nov 29, 2020 , 04:03:23

అయ్యప్ప దేవాలయాల్లో 30న పడి వెలిగించాలి

అయ్యప్ప దేవాలయాల్లో 30న పడి వెలిగించాలి

పాలమూరు: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సోమవారం అయ్యప్పస్వామి దేవాలయాల్లో రాత్రి 9 గంటలకు పడి వెలిగించాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు సీమ నరేందర్‌ గరుస్వామి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు రాజు దేశ్‌పాండే గురుస్వామి పిలుపు మేరకు విశ్వశాంతి కోసం ఆరు రాష్ర్టాల్లో కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 9గంటల 5 నిమిషాలకు ఆరు రాష్ర్టాల్లో ఒకే సమయాన అయ్యప్పస్వామి దేవాలయాల్లో పడి వెలిగించి కరోనా వ్యాధిని తరిమికొట్టేందుకు కృషి చేద్దాన్నారు. logo