మంగళవారం 09 మార్చి 2021
Mahabubnagar - Nov 28, 2020 , 02:16:54

ప్రాంగణ ఎంపిక జాబితా విడుదల

ప్రాంగణ ఎంపిక జాబితా విడుదల

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : పాలమూరు విశ్వవిద్యాలయం లో ఈనెల 17న ఎంఎస్‌ఎన్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ప్రతిభకనబర్చి ఉద్యోగాలు సాధించిన వారి జాబితాను శుక్రవారం పీయూ రిజిస్ట్రార్‌ పవన్‌కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించిన ఎంఎస్‌ఎన్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాం టి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. వివిధ కళాశాలలకు చెందిన 24 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, నూరహాన్‌, అర్జున్‌కుమార్‌, ఎంఎస్‌ఎన్‌ సంస్థ హెచ్‌ఆర్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

తాజావార్తలు


logo