శనివారం 23 జనవరి 2021
Mahabubnagar - Nov 28, 2020 , 02:16:54

‘గ్రేటర్‌'లో టీఆర్‌ఎస్‌దే విజయం

‘గ్రేటర్‌'లో టీఆర్‌ఎస్‌దే విజయం

  • దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి 

భూత్పూర్‌/మూసాపేట : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సా ధించడం ఖాయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముసారాంబాగ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునరితారెడ్డి తరఫున ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి ముసారాంబాగ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ కదిరె అశోక్‌రెడ్డి, మార్కెట్‌ క మిటీ వైస్‌చైర్మన్‌ సత్తూర్‌ నారాయణగౌడ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo