Mahabubnagar
- Nov 27, 2020 , 02:56:44
మొసలి కలకలం

- ఆందోళనలో శంకరామయ్యపల్లి గ్రామస్తులు
మూసాపేట(అడ్డాకుల) : అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామ చౌటచెరువులో గురువారం మొసలి సంచారం కలకలంరేపింది. పశువులకాపరులు చెరువులో మొసలిని చూసి గ్రామస్తులకు చెప్పడంతో ఆందోళన మొదలైంది. విషయాన్ని సర్పంచ్ మల్లికానాగరాజు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. చెరువు మధ్యలో మొసలి కనిపించడంతో సెల్ఫోన్లో ఫొటోలు తీసి డీఎఫ్వో గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. దీనిపై డీఎఫ్వో సానుకూలంగా స్పందించి శుక్రవారం మొసలిని పట్టుకునేందుకు సిబ్బందిని పంపిస్తానని చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. పైభాగంలో ఉన్న జగ్గాయిపల్లి చెరువు నుంచి చౌటచెరువుకు నీళ్లు వచ్చాయని, ఆ చెరువు నుంచే మొసలి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING