గురువారం 21 జనవరి 2021
Mahabubnagar - Nov 25, 2020 , 06:36:39

సినిమా హాళ్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి

 సినిమా హాళ్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి

  •  మార్చి 16 నుంచి రాష్ట్రంలో థియేటర్ల మూత
  •  ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఏర్పాట్లు  
  • సినిమా అభిమానుల్లో హర్షాతిరేకాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న కార్మికులు 

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా.. ప్ర పంచాన్ని అతలాకుతలం చేసిం ది. సుమారు ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పెడుతున్నది. గుడి, బడి తేడా లేకుండా జనం కలిసే చోట్లన్నీ మూతపడ్డాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. మార్చి 22 నుంచి లా క్‌డౌన్‌ ప్రారంభం కాగా.. అం తకు ముందే మార్చి 16 నుంచి జనం రద్దీ ఉండే ప్ర దేశాలను షట్‌డౌన్‌ చేశారు. సినిమా థియేటర్లు సైతం మార్చి 16 నుంచి మూతబడ్డాయి. దీంతో ఆ రంగంపై ఆధారపడిన వారంతా ఆగమయ్యారు. సినిమా టిక్కెట్లు ఇచ్చే వ్యక్తుల నుంచి టార్చ్‌ బాయ్‌ వరకు, క్యాంటీన్లు నిర్వహించుకునే వారి నుంచి టీ స్టాల్స్‌ నడుపుకునే వారు అంతా కలిపి ఉమ్మడి జిల్లాలోని 55 థియేటర్ల పరిధిలో సుమారు 1,500 వరకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారందరి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కో రంగం క్రమంగా తిరిగి ప్రారంభం అవుతున్న దశలో సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో సినిమాహాళ్లు సైతం తెరుచుకోనున్నా యి. నిబంధనల మేరకు ఓపెన్‌ చేసేందుకు అనుమ తి ఇవ్వడంతో ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోసిపోయిన వెండితెర సుదీర్ఘ విరామం అనంతరం వెలుగులు పంచేందుకు సిద్ధం అవుతోంది.

ప్రారంభం కానున్న సందడి..

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో టాకీసులు తెరుచుకోనుండడంతో నిర్వాహకుల్లో ఆనందం వెల్లువెత్తుతున్నది. మరోవైపు థియేటర్లపై ఆధారపడి బతుకీడుస్తున్న వర్గాలకు సైతం ఊరట లభించనున్నది. ప్ర భుత్వ ప్రకటనతో తిరిగి తమ జీవితాన్ని కొనసాగించేందుకు వరుస కడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట, జడ్చర్ల తదితర పట్టణాల్లో థియేటర్లు ఎక్కువగా ఉన్నాయి. హాళ్లు తెరుచుకోనుండడంతో అభిమానుల్లో సందడి కనిపిస్తోంది. కొ త్త సినిమాల ప్రదర్శనకు అంతా సిద్ధం అవ్వడంతో ఇక అభిమాన కథానాయకులు, కథానాయికల చి త్రాలు చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. షూటింగ్‌ పూర్తై విడుదలకు సిద్ధమైన నిర్మాతలకు ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం వరంగా మారనున్నది. 

ఓటీటీ వర్సెస్‌.. సినిమా థియేటర్‌..

థియేటర్లు బంద్‌ కావడంతో ప్రజలంతా కరోనా కాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వెతుక్కున్నా రు. ఎంటర్‌టైన్మెంట్‌ విభాగంలో వచ్చిన అధునాత న సాంకేతికతను వినియోగించుకున్నారు. కొత్త సినిమాలు చూసేందుకు టాకీసులు అవసరం లేకుండా నే వచ్చినటువంటి ఓటీటీలకు గడిచిన ఏడాది కాలం లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తద్వారా టా కీసుల అవసరం లేకుండానే ఇంట్లోనే ఇంటిల్లిపాది సినిమాలు చూశారు. అయితే, సినిమా హాళ్లు తెరుచుకుంటుండటంతో అభిమానులు టాకీస్‌ వైపు వస్తారా..? లేక ఓటీటీకే ఓటేస్తారా..? అనే సందేహాలున్నాయి. కొవిడ్‌కు ముందు ఓటీటీకి పెద్దగా స్పం దనే ఉండేది కాదు. కరోనా దెబ్బతో నిర్మాతలు సై తం ఓటీటీలో సినిమాలను విడుదల చేయడంతో ప్రేక్షకులు వీక్షించారు. ఇప్పుడు అసలైన థియేటర్‌ మజా వస్తుండటంతో ఓటీటీకి స్పందన తగ్గనుందని భావిస్తున్నారు. ఓటీటీలో సినిమా చూస్తే మజా రాదని.. థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. తమ అభిమాన నటుడిని థియేటర్లో చూస్తూ చేసే సందడి కోసం తామంతా ఎదురుచూస్తున్నామని మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ నాయక్‌ అనే అభిమాని తెలిపాడు. కొవిడ్‌ నిబంధనల మేరకు థియేటర్లలో ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


logo