మంగళవారం 19 జనవరి 2021
Mahabubnagar - Nov 24, 2020 , 00:40:18

యోగా సంఘం రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు

యోగా సంఘం రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : యోగా క్రీడా సంఘం రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో యోగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాములును రాష్ట్ర కమిటీ ప్యాట్రన్‌గా, సెక్రటరీ బాల్‌రాజ్‌ను రాష్ట్ర కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర నూతన కార్యవర్గంలో ఇద్దరికి చోటు లభించడంపై క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.