ఆదివారం 24 జనవరి 2021
Mahabubnagar - Nov 23, 2020 , 02:34:41

గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలి

గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలి

  •  అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం
  • ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు

భూత్పూర్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మండల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొంటున్నారు. ఆదివారం ఎమ్మె ల్యే వెంకటేశ్వర్‌రెడ్డికి కేటాయించిన ముసారాంబాగ్‌ (25) వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎంపీపీ డాక్టర్‌ కదిరె శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, శాంతి భధ్రతలను కాపాడుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ ను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌బస్వరాజ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్య కర్తలు  పాల్గొన్నారు.

మండల నాయకులు ప్రచారం

రాజాపూర్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ మండల నాయకులు లింగోజీగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. లింగోజీగూడ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి ముద్రబోయిన శ్రీనివాస్‌రావును గెలిపించాలని ఇం టింటికీ తిరిగి ప్రచారం చేశారు. ప్రజా సం క్షేమం కోసం సర్కారు అందజేస్తున్న ప్రథకాలను ప్రజలకు వివారించారు. అభ్యర్థి శ్రీనివాస్‌రావును గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను  వివరిస్తూ...

నవాబ్‌పేట : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు లింగోజీగూడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రావు గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. లింగోజీగూడలో ఇంటింటికీ తిరిగి ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీటీసీ సంఘం అధ్యక్షుడు, నవాబ్‌పేట జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ ఎంపీపీ సంతోశ్‌రెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభ్యర్థిని గెలిపించాలి

మూసాపేట(అడ్డాకుల) : అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల సునరితారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ జితేందర్‌రెడ్డిలతోపాటు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మూసాపేటకు చెందిన : జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహా యాదవ్‌, స ర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, సింగిల్‌విం డో చైర్మన్‌ వెంకటశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణయ్య, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా విద్యానగర్‌లో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌తోపా టు కౌన్సిలర్లు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్‌గౌడ్‌, వేదవ్రత్‌, షేక్‌ ఉమర్‌, నాయకులు శివరాజ్‌, రాములు, పాండు, శాంతన్న, నందులాల్‌, ప్రేమలత, ప్రేమ్‌కుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆసిఫ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్‌ ఇసాక్‌, ముషీరాబాద్‌లో ఇఫ్తికార్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. 

ప్రచారంలో పాల్గొన్న నాయకులు

ఊట్కూర్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా రాంనగర్‌ డివిజన్‌లో మరోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుస్తారని రాంనగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చా ర్జ్జి, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాంనగర్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా వివిధ గ్రామాల నుం చి 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు చిట్టెంతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, రైతు బం ధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ రవిప్రసాద్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, పీఏసీసీఎస్‌ మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

‘అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేస్తా’

కోస్గిటౌన్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జ్జిగా ఉంటూ అభ్యర్థి తరఫున కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీలతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజేంద్రనగర్‌ అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. కచ్చితంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 


logo