శనివారం 28 నవంబర్ 2020
Mahabubnagar - Nov 22, 2020 , 01:06:59

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
  • రాంనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం

మక్తల్‌ రూరల్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక డివిజన్లు గెలుచుకొని మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ము షిరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని రాం నగర్‌ డివిజన్‌ (87)లో టీఆర్‌ఎస్‌  కార్పొరేట్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా వి  స్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మక్తల్‌ ప ట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్త లు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డిని  అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్‌గా గెలిపిండానికి కృషి చేస్తానన్నారు. ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకగా తీసుకుని అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేసి అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.