గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Nov 01, 2020 , 03:14:55

త్వరగా పూర్తి చేయండి

త్వరగా పూర్తి చేయండి

  •  రైతువేదిక పనులు వేగవంతం చేయాలి
  • కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ : రైతువేదికలను ఈ నెల 7వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధింత అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. నిర్మాణానికి అవసరమైన డబ్బులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశించిన సమయం లోగా రైతువేదికలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నండ్లాల్‌ పవార్‌, ఆర్డీవో శ్రీనివాసులు, డీఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

రైతువేదికల పనులు పూర్తి చేయాలి 

కోయిలకొండ : రైతువేదికల పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవార్‌ అన్నారు. మండలంలోని వింజామూర్‌, కోయిలకొండలోని రైతువేదిక పనులను పరిశీలించారు. పనుల పురోగతి వివరాలు ఇప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, ఎంపీడీవో రాఘవ, వైస్‌ ఎం పీపీ కృష్ణయ్య, సర్పంచ్‌ కృష్ణయ్య, టెక్నికల్‌ అసిస్టెంట్‌ కార్తీక్‌ పాల్గొన్నారు.