బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 31, 2020 , 01:47:54

మైనార్టీల అభ్యున్నతికి కృషి

మైనార్టీల అభ్యున్నతికి కృషి

  • క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం క్రిష్టయన్‌పల్లిలోని డబుల్‌ బెడ్‌రూం సమీపంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 200లకు పైగా మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆరెకరాల స్థలంలో అన్ని హంగులతో బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బైపాస్‌ రోడ్డు పనులు పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, కౌన్సిలర్లు రాణి, ఉమర్‌షేక్‌, పటేల్‌ప్రవీణ్‌, శ్రీనివాసులు, నాయకులు మక్సూద్‌హుస్సేన్‌, సమద్‌ఖాన్‌, రాజు, మోసీన్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.