ఆదివారం 29 నవంబర్ 2020
Mahabubnagar - Oct 30, 2020 , 01:37:29

సర్వం ధరణిమయం

సర్వం ధరణిమయం

  • నవంబర్‌ 2 నుంచి సేవలు 
  • జాయింట్‌ సబ్‌రిజిస్టర్‌ ఆఫీసులుగా  తాసిల్‌ కార్యాలయాలు 
  •  ఇక మ్యుటేషన్‌ సమస్యలకు చెల్లుచీటి
  •  గ్రామీణ ప్రజలకు  తగ్గనున్న దూరభారం
  • అన్నదాతల హర్షం

 ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ధరణి శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. గురువారం మేడ్చల్‌ జిల్లా ముడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభించారు. నవంబర్‌ 2వ తేదీ నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ఇకపై జాయింట్‌ సబ్‌రిజిస్టర్‌ ఆఫీసులుగా తాసిల్‌ కార్యాలయాలు మారనున్నాయి. రెవెన్యూ సేవలు సులభంగా, పారదర్శకంగా అందనున్నాయి. మ్యుటేషన్‌ సమస్యలు తీరనున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఎవరూ జేయని పని కేసీఆర్‌ జేసిండుకొన్నేండ్ల నుంచి ఊర్లల్లో పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తేవడం సంతోషం. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. కానీ భూముల గొడవలకు పరిష్కారం చూపిన దాఖలాల్లేవు. గతంలో శానా మంది రెవెన్యూ సార్లు రైతుల మధ్య తగువు పెట్టి తమాషా చూశారే తప్ప చేసిందేమీ లేదు. రైతు బాధలు కండ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ సారు కొత్త చట్టాన్ని తీసుకురావడం చూస్తుంటే రైతులందరికీ  మంచి రోజులొచ్చినట్టే.

- ప్రభాకర్‌గౌడ్‌, రైతు, పోమాల, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్‌