మంగళవారం 24 నవంబర్ 2020
Mahabubnagar - Oct 30, 2020 , 01:37:29

ఆపదలో అండగా ఉంటాం

ఆపదలో అండగా ఉంటాం

  •  సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • ఎంపీ మన్నెతో కలిసి సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

  మహబూబ్‌నగర్‌ : ప్రతి కుటుంబానికి ఆపదలో అండగా ఉంటామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం పాలమూరు జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో 57 మందికి రూ.22.72 లక్షల విలువైన సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బాధితులకు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రక్షణ కవచంలా ఉంటూ ప్రజలను కాపాడుకుంటామని చెప్పారు. ఎవరికైనా ఆపద వస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని తెలిపారు. మంచి చేసి నా తప్పులు వెతికి ప్రజల మెప్పు పొం దేందుకు వివిధ పార్టీల నేతలు తెగ ప్ర యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇ లాంటి వారికి ప్రజాధరణ దక్కదని చె ప్పారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ ప్ర భుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అ ద్భుతంగా ఉన్నాయని పలు రాష్ర్టాలు ప్ర శంసలు గుప్పిస్తున్నాయన్నారు.

ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో సర్కారు అడుగులు వేస్తున్నదని చెప్పా రు. అందరం సమిష్టిగా ఉంటూ అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.