శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 28, 2020 , 02:10:41

జోరుగా గుట్కా దందా..!

 జోరుగా గుట్కా దందా..!

బాలానగర్‌ టౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా వ్యాపారులపై సోదాలు నిర్వహించి నిషేధిత గుట్కాలు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాలానగర్‌ మండలంలో మాత్రం పోలీస్‌ యం త్రంగం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించినా చిరు వ్యాపారులపై దాడు లు నిర్వహించి నామా మాత్రం కేసులు నమోదు చేసి పోలీసుల ప్రతాపం చూపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గుట్కాను నిషేధించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు, గుట్కా పదార్థాలు వ్యాపారుల పాలిట వరాలు కురిపిస్తున్నాయి. మండలంలో కేవలం కొందరు వ్యాపారులు అక్రమార్జనే లక్ష్యంగా ఎంచుకొని ఇండ్లు, షాపుల వద్ద అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని నిషేధిత పదార్థాలను దిగుమతి చేసుకుంటూ నిత్యం తక్కువలో తక్కువ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మండలంలో గుట్కా వ్యాపారులే కాక నకిలీ విత్తన వ్యాపారులు, దొంగబెల్లం వ్యాపారులకు మం చి అడ్డాగా మారింది. స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు సైతం ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. నిత్యం ఇత ర రాష్ర్టాల నుంచి రోడ్డు రవాణా మా ర్గం, ట్రాన్స్‌ఫోర్టుల్లో పట్టణంలోకి వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని పలు కంపెనీల్లో పని చేసేవా రు,  పోలేపల్లి సెజ్‌లో ఉద్యోగాలు చేసుకునేందుకు ఇతర రాష్ర్టాల నుంచి భా రీగా జనాలు రావడంతోపాటు అత్యధికంగా గుట్కాలు తినే అలవాటు ఉండడంతో అక్రమార్కుల వ్యాపారం టార్గె ట్‌ చేసుకునే నడుస్తున్నట్లు తెలుస్తున్న ది. పట్టణంలో పర్యవేక్షణ చేయాల్సిన వి విధ శాఖల ప్రభుత్వ అధికారులతోపాటు నిఘా ఉంచాల్సిన పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నది. పట్టణంలో తెలియకుండా జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై పోలీసు అధికారులతోపాటు వివిధ శాఖల అధికారులు నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుం టే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

నిషేధించేలా చర్యలు తీసుకోవాలి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గుట్కాలను కొం దరు అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యం గా యువతతోపాటు పెద్ద వారు సైతం లెక్క చేయకుండా గు ట్కాలు తినడం వల్ల నోటి, గొంతు క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు ని త్యం తనిఖీలు చేసి మత్తు పదార్థాలు, గుట్కాలను అమ్మకుం డా నిషేధించాలి.

- బాలు, బాలానగర్‌

చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపారులు అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలను ఉంచుకోరాదు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టరీత్యా చర్య లు తీసుకుంటాం. ఇలాంటి కేసుల్లో దాదాపు 3 ఏండ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా గుట్కాలను తినరాద్దు. మత్తు పదార్థాల వల్ల నరాల వ్యాధులతోపాటు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది.

-కృష్ణయ్య ఎస్సై, బాలానగర్‌