బుధవారం 20 జనవరి 2021
Mahabubnagar - Oct 28, 2020 , 02:10:39

ప్రకృతి ప్రసాదం.. సీతఫలం

ప్రకృతి ప్రసాదం.. సీతఫలం

బాలానగర్‌ : శీతాకాలంలో ఎక్కువగా లభించే మధురఫలం సీతాఫలం.. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ముఖ్యమైన్నది. అందులో ఎన్నో పోషకాలతోపాటు ఔషధ గుణాలున్నాయి. దీన్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతు న్నదని వైద్యులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే సీతాఫలాలు మార్కెట్‌లోకి వచ్చాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి బాలానగర్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సీతాఫలాలు తెచ్చి అమ్ముతున్నారు. వర్షాలు అధికంగా కురువడంతో కాయలు ఎక్కువగా లభి స్తున్నాయని విక్రయదారులంటున్నారు. దీంతో కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫలంలో విటమిన్‌ ఏ, బీ 6సీ తోపాటు మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌, జింక్‌, పైబర్‌ ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరానికి అవసరమ య్యే పీచు పదార్థం లభిస్తున్నది. క్యాలరీస్‌ అధికంగా ఉం డడంతో ఈ పండ్లు తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతు న్నది. జలుబు, ఇన్‌ఫెక్షన్ల వంటివి రాకుండా కాపాడుతున్న ది. ఎముకలను బలంగా మార్చడంతోపాటు కీళ్ల నొప్పులను నివారిస్తున్నది.  జుట్టు ఆర్యోగవంతంగా ఉండడంతోపాటు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు  పంపి ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను తగ్గిస్తు న్నది. కంటి చూపుతో  పాటు హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచి రక్తహీనతతో బాధపడేవారికి మేలు చేస్తున్నది. మగవారిలో ఏర్పడే నరాల బలహీనతను తగ్గించి కండరాల పటుత్వం పెంచడంతో తోడ్పడుతున్నది. ఎదిగే పిల్లలకు రోజూ రెండు పండ్లు తినిపిస్తే మంచిది. 

సీతాఫలాల వల్ల లాభాలు

- 100 గ్రాముల గుజ్జులో 94క్యాలరీల శక్తి, 20-25 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రాముల ప్రోటీన్లు, 4.4 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది.

- కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడానికి అయుర్వేదంలో సీతాఫలం ఆకులను ఉపయోగిస్తారు. 

- పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు తగ్గించడానికి ఆకులు, చెట్టు బెరడును వాడుతుంటారు.

- గర్భిణులు ఈ పండు తినడం వల్ల దీనిలోని పోషకాలు తల్లి, శిశువుకు మేలు చేస్తాయి.

- మలబద్దకంతో బాధపడే వారికి దివ్యఔషధంలా పనిచేస్తున్నది.

- మానసిక ఆందోళన, ఆరోగ్య సమస్యలను దూరం చేస్తున్నది.

- ఆకులను మెత్తగా నూరి కాస్త పసుపు కలిపి మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట రాస్తే నయమవుతున్నది.

- ఈ పండు గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతున్నది.

- అల్పాహారంగా డైటింగ్‌ చేసే వారికి ఉపయుక్తం.

- విరేచనాలతో బాధపడే వారికి బెరడును కాచగా వచ్చి న కషాయాన్ని ఔషధంగా ఇస్తుంటారు. వీటి గింజలను పొడిచేసి తలకు రాసుకుంటే పేన్ల సమస్య ఉండదు. logo