శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 27, 2020 , 04:10:11

జనరల్‌ దవాఖానలో నిత్యాన్నదానం

జనరల్‌ దవాఖానలో నిత్యాన్నదానం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : ప్రభుత్వ జనరల్‌ దవాఖానకు వచ్చే రోగులకు, సహాయకులకు నిత్యాన్నదాన పంపిణీని ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దవాఖాన ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారి కోదండపాణి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సావరిన్‌ సర్వీసెస్‌ ముందుకు వచ్చి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వక్త షఫీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ పాల్గొన్నారు.