గురువారం 26 నవంబర్ 2020
Mahabubnagar - Oct 25, 2020 , 00:54:32

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

  • భక్తిశ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

పాలమూరు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జి ల్లా కేంద్రంలోని రేణుక ఎల్ల మ్మ అలయంలో అమ్మవారిని మహిషాసురమర్ధినిగా, కాళికాదేవి ఆలయంలో దుర్గాదేవిగా, వెంకటేశ్వర కాలనీలో అమ్మవారిని దుర్గాదేవిగా అ లంకరించి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అదేవిధంగా వీ రన్నపేటలో చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తొగట వీరక్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో 108 కలశాలకు పూజలు చేసి అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమం లో కురుమూర్తి, విశ్వనాథ్‌, పాండు, బాలకిషన్‌ పాల్గొన్నారు. 

రాజాపూర్‌ మండలంలో..

రాజాపూర్‌ : మండల కేంద్రంతోపాటు చొక్కంపేట, దోండ్లపల్లి గ్రామాల్లో అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వాహించారు. తిర్మలాపూర్‌ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిదేవిగా అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు బచ్చిరెడ్డి, దాచని మహేశ్వరి, మహిపాల్‌రెడ్డి, నర్సింహమూర్తి, రామ్మూర్తి, పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, నర్సింహులు పాల్గొన్నారు. 

బాలానగర్‌ మండలంలో..

బాలానగర్‌ టౌన్‌ : మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

దేవరకద్ర మండలంలో.. 

దేవరకద్ర రూరల్‌ : మండలకేంద్రంతోపాటు, కౌకుంట్ల, పేరూర్‌, గోపన్‌పల్లి, లక్ష్మీపల్లి, వెంకటాయపల్లి గ్రామాల్లో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భూత్పూర్‌ మున్సిపాలిటీలో..

భూత్పూర్‌ : పురపాలక సంఘంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్తూర్‌ అశోక్‌గౌడ్‌, నాగరాజు, అర్చకులు మంజునాథస్వామి, ప్రభులింగం పాల్గొన్నారు.