శనివారం 16 జనవరి 2021
Mahabubnagar - Oct 25, 2020 , 00:54:36

సుందర పట్టణంగా పాలమూరు

సుందర పట్టణంగా పాలమూరు

  • రోడ్లు, జంక్షన్ల అభివృద్ధితోనూతన శోభ 
  • రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
  • అభివృద్ధికి కలిసిరావాలి 
  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • మహబూబ్‌నగర్‌ కొత్త చెరువులో బోటింగ్‌ ప్రారంభం 

మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/క్లాక్‌టవర్‌/హన్వాడ : మ హబూబ్‌నగర్‌ పట్టణాన్ని అన్ని విధాలా సుందరంగా తీర్చిదిద్దుతామని ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని కొత్తచెరువులో ప ర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్‌ సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. అ నంతరం రూ.15 లక్షలతో చేపట్టిన డీఈవో ఆఫీస్‌ చౌరస్తా, రూ.30 లక్షలతో చేపట్టిన సద్దలగుండు చౌరస్తా, రూ.20 లక్షలతో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు చేపట్టిన డివైడ ర్లు, సెంట్రల్‌లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కొత్తచెరువును కృష్ణానది నీటితో నింపి చేపల చెరువుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెరువు పట్టణానికి సమీపంలో ఉన్నందున పర్యాటకంగా డెవలప్‌ చేస్తామన్నారు. ముందుగా ఒక స్పీడ్‌బోటు, మూడు స్పెడల్‌ బోట్లు ఏర్పాటు చేశామన్నారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అంతకు ముందు చిన్నదర్పల్లిలో రూ.25 లక్షలతో నిర్మించనున్న సీసీ, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 

దివ్యాంగులకు సరుకులు పంపిణీ..

దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిన ఏకైక ప్ర భుత్వం టీఆర్‌ఎస్సేనని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సమర్థన ట్రస్టు సమకూర్చిన నిత్యావసర సరుకులను మంత్రి దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3016 పింఛన్‌ ఇస్తున్నట్లు గుర్తు చే శారు. జిల్లాలో 20 మంది ది వ్యాంగులకు ఇ టీవల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. అంతకుముందు క్రౌన్‌ ఫంక్షన్‌హాల్‌లో సిద్దిపేట ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన సరుకులను పేదలకు పంపిణీ చేశారు. సిద్ధిపేట ఫౌండర్‌ సాకత్‌నజీర్‌ ఆదేశాల మేరకు రెండు వేల మందికి సరుకులు అందజేసినట్లు నిర్వాహకులు లయక్‌, హజీం షరీఫ్‌ తెలిపారు. ప్రజలకు మంత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు. 

బీటీరోడ్డు పనులు ప్రారంభం..

బంగారు తెలంగాణగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం హన్వాడ నుంచి మహ్మదాబాద్‌ వరకు రూ.2.62 కోట్లతో చేపట్టిన బీటీరోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను మళ్లీ ఆదరిస్తారన్నారు. 

సద్దుల బతుకమ్మలో పాల్గొన్న మంత్రి 

జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతంలో ని ర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ హాజరయ్యారు. కాలనీ మహిళలు సంబురంగా బతుకమ్మ ఆడారు. ఆయా కా ర్యక్రమాల్లో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌,మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ సత్యనారాయణ, కౌన్సిలర్లు పుష్పావతి, కోట్లనర్సింహ, కట్టారవికిషన్‌రెడ్డి, లతశ్రీ, రాం, మోతీలాల్‌, శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌, సమర్థన ట్రస్ట్‌ ప్రతినిధులు రాజశేఖర్‌, శ్రీనివాసులు, ప్రైవేట్‌ పాఠశాలల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విక్రందేవ్‌, హన్వాడ ఎంపీపీ బాల్‌రాజ్‌, జెడ్పీటీసీ విజయనిర్మల, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటయ్య, వైస్‌ చైర్మన్‌ కృష్ణయ్యగౌడ్‌, సర్పంచ్‌ రేవతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు కరుణాకర్‌గౌడ్‌, శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రాజుయాదవ్‌, నాయకులు జయదేవ్‌, మోసిన్‌, ప్రశాంత్‌, కొండ లక్ష్మయ్య, బాలయ్య, జంబులయ్య, బసిరెడ్డి, రామణారెడ్డి, నరేందర్‌,సత్యం, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.