గురువారం 28 జనవరి 2021
Mahabubnagar - Oct 25, 2020 , 00:54:38

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

  • కొల్లాపూర్‌ మండలం  సింగవట్నంలో సంఘటన 

కొల్లాపూర్‌ : గాఢ నిద్రలో ఉన్న కన్న తల్లిని మద్యం మత్తులో అతి కిరాతకంగా హత్య చేశాడో కొడుకు. నరికిన తల్లి తల తీసుకొని పరారైన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగవట్నంలో చోటు చేసుకున్నది. చంద్రమ్మ పెద్దకొడుకు కురుమయ్య కథనం మేరకు..సింగవట్నం గ్రామానికి చెందిన పుట్ట నడిపన్న, చంద్రమ్మ(65) దంపతులు. వీరికి కురుమయ్య, రాముడు కుమారులు. అయితే చిన్న కొడుకు రాముడు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో విసిగి వేసారిన అతని భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.

పని పాట లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి మ ద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లి చంద్రమ్మతో గొడవకు దిగా డు. ఎంతకూ ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడై నిద్రపోతున్న కన్నతల్లిపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తర్వాత తల నరికి తీసుకొని పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై మురళీగౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకొని జాగిలం తెప్పించారు. పరారైన రాముడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పెద్ద కొడుకు కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్‌ దవాఖానకు తరలించారు.  logo