శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 23, 2020 , 02:16:36

నాయిని సేవలు చిరస్మరణీయం

నాయిని సేవలు చిరస్మరణీయం

మహబూబ్‌నగర్‌ : నాయిని నర్సింహారెడ్డి రాష్ర్టానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, డీసీసీబీ వైస్‌ చై ర్మన్‌ కొరమోని వెంకటయ్య అన్నారు. జి ల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నాయిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కట్టా రవికిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రెడ్డి సేవా సమితి బాలికల వసతిగృహంలో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి రెడ్డి సేవా సమితి నాయకులు పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూము ఇంద్రసేనారెడ్డి, పోతుల రాఘవరెడ్డి, నాయకులు పసుల ధనుంజయరెడ్డి, మల్లు నరసింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.