గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 21, 2020 , 02:56:21

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కాట్రపల్లి లక్ష్మయ్య

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కాట్రపల్లి లక్ష్మయ్య

జడ్చర్ల : బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్‌ నూతన కమిటీ చైర్మన్‌, పాలకవర్గాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. బా దేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌గా బాదేపల్లికి చెందిన మాజీ స  ర్పంచ్‌ కాట్రపల్లి లక్ష్మయ్యను నియమించారు. అందుకు సంబంధించి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జా రీ అయ్యాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ క మిటీకి ఇంతకు ముందు ఉన్న పాలకవర్గ గడువు ముగియడంతో నూతన కమిటీని ప్రకటించారు. నూతన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాదేపల్లికి చెందిన కాట్రపల్లి లక్ష్మయ్యను ఎంపిక చేయగా వైస్‌ చైర్మన్‌గా నారాయణగౌడ్‌, డైరెక్టర్లుగా శివదర్శన్‌, చంద్రశేఖర్‌రెడ్డి, అబ్దుల్‌ హబీబ్‌, ఉడిత్యావత్‌ హీర్యా, బి.అంజమ్మ, రేణయ్య, ఎ.సు భాష్‌, ఎం.రామకృష్ణారెడ్డిలను ఎంపిక చేశారు. వీరితోపాటు మార్కెట్‌ కమి టీలో సభ్యులుగా బాదేపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు, ఏడీ మార్కెటింగ్‌ మహబూబ్‌నగర్‌, జడ్చర్ల డివిజన్‌ వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, జడ్చర్ల మున్సిప ల్‌ కమిషనర్‌ ఉంటారు. నూతన పాలకవర్గం ఏ ర్పాటుపై జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌.సి.లక్ష్మారెడ్డికి కాట్రపల్లి లక్ష్మయ్యతో పాటు డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారా న్ని దసరా తర్వాత చేయనున్నట్లు తెలిపారు.