గురువారం 22 అక్టోబర్ 2020
Mahabubnagar - Oct 18, 2020 , 00:43:35

అంబులెన్స్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల

అంబులెన్స్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల

   దేవరకద్ర రూరల్‌ :  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పిలుపులో భాగంగా ప్రత్యేక సదుపాయాలు ఉన్న అంబులెన్స్‌ను శనివారం కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవరకద్ర పీహెచ్‌సీ పరిధిలో అంబులెన్స్‌ సేవలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కృష్ణ, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, తాసిల్దార్‌ జ్యోతి, విండో చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, డాక్టర్‌ షబానాబేగం, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, వైస్‌ ఎంపీపీ సుజాత, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, నాయకులు పాల్గొన్నారు. 


logo