బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 10, 2020 , 00:32:27

చీరె మెరిసె.. మహిళ మురిసె..

చీరె మెరిసె.. మహిళ మురిసె..

  • దసరాకు సర్కారు కానుక
  • వనపర్తి, పెబ్బేరులో చీరెలు పంపిణీ చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి
  • హన్వాడ, ఏనుగొండలో ఇంటింటికి తిరిగి అందజేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • ఆయా నియోజకవర్గాల్లో అందజేసిన ఎమ్మెల్యేలు
  • బతుకమ్మ చీరెలతో మురిసిపోయిన మహిళలు

పల్లెలు, పట్టణాల్లో దసరా పండుగ ముందుగానే వచ్చినట్లున్నది. బతుకమ్మ చీరెల పంపిణీ షురూ కావడంతో మహిళాలోకం సంబుర పడుతున్నది. పేదలు కూడా పండుగను ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో సర్కారు చీరెల పంపిణీ చేపట్టింది. ఈమేరకు శుక్రవారం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, పెబ్బేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేయగా, ఏనుగొండ, హన్వాడలో ఇంటింటికి తిరిగి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ