గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 08, 2020 , 03:05:15

ఇంటికొచ్చే సిబ్బందికి వివరాలు తెలపండి

ఇంటికొచ్చే సిబ్బందికి వివరాలు తెలపండి

  •  రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ

    మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : ఇంటికొచ్చే సిబ్బందికి వివరాలు తెలియజేసి సహకరించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని వివేకానంద నగర్‌, న్యూటౌన్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి ఆయన పరిశీలించారు. మున్సిపల్‌ సిబ్బంది నిర్వహిస్తున్న ఆస్తుల వివరాలు నమోదు చేసే ప్రొఫార్మాను పరిశీలించి సిబ్బందితో పాటు ప్రజలకు పలు సూచనలు అందించారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయ భూములకు ఇచ్చిన విధంగానే ఆస్తులకు సంబంధించి పాస్‌పుస్తకాలు ఇవ్వడానికే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌,అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవర్‌, కమిషనర్‌ సురేందర్‌, మున్సిపల్‌ సిబ్బంది అహ్మద్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.