బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 08, 2020 , 03:05:15

ఉచిత వైద్య సేవలు అభినందనీయం

ఉచిత వైద్య సేవలు అభినందనీయం

  • మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

  మరికల్‌ : పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం కన్మనూర్‌ గ్రామంలో మీదిమాల వెంకట్‌రెడ్డి జ్ఞాపకార్థం బుధవారం హైదరాబాద్‌ ఆవాస దవాఖాన, గ్రీన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన కుమారులు రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ పద్మజారెడ్డి ప్రారంభించారు.

ఈ శిబిరాన్ని ఎంపీ పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల వైద్య సేవలు అందించడంపై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ శరత్‌ చంద్రారెడ్డి, ఎంపీటీసీ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.