సోమవారం 25 జనవరి 2021
Mahabubnagar - Oct 06, 2020 , 04:06:43

ప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి

ప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి

ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): చిన్నపిల్లల కడుపులో నులిపురుగులు అభివృద్ధి చెంది అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే ప్రతి చిన్నారికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని పురస్కరించుకొని పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రల ను ఆయన మింగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2,78,511 మంది 1-19 ఏండ్లలోపు ఉన్న వారు ఉ న్నారని తెలిపారు. వీరందరికీ ఈనెల 5 నుంచి 12 వర కు నివారణ మందులు వేయనున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సమయంలో ప్రత్యేకంగా దవాఖాన ఏర్పాటు చేయటంతోపాటు డాక్టర్లు, నర్సులను నియమించామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లకుండా ఇక్కడే చికిత్సలు నిర్వహించినట్లు పేర్కొన్నా రు. కొత్త కలెక్టర్‌ కార్యాలయం భవనం పూర్తయిన తర్వా త పాత కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రజల ఆరోగ్య, సంక్షే మం కోసం వినియెగించుకొనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 

పండుగ సాయన్న కృషి మరవలేనిది

మహబూబ్‌నగర్‌ : పేదల క్షేమం కోసం పండుగ సాయన్న చేసిన కృషి మరవలేనిదని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పండుగ సాయన్న కుటుంబసభ్యులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. చిన్నతనం నుంచి పండుగ సాయన్న విరోచిత పోరాటం, చేసిన మేలు అందరికీ తెలుసన్నారు. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ఉన్న పండుగ సాయన్న సమాధిని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. పండుగ సాయన్న కుటుంబ సభ్యులకు రెండు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పండుగ సాయన్న కుటుంబ సభ్యులను శాలువా, పూలమాలతో మంత్రి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, ప్రోగ్రాం అధికారి శంకర్‌, డెమో అధికారి తిరుపతిరావు, వేణుగోపాల్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు నటరాజ్‌, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, రవికిషన్‌రెడ్డి, పటేల్‌ ప్రవీణ్‌, కిశోర్‌, నాయకులు కృష్ణమోహన్‌, గంజి వెంకన్న, బెక్కం జనార్దన్‌, పండుగ సాయన్న వారసులు నర్సింహ, యాద య్య తదితరులు పాల్గొన్నారు. 


logo