మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 29, 2020 , 06:29:53

బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

  • కొవిడ్‌ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలి అందుబాటులో  లక్షా 60 వేలు    
  • లబ్ధిదారులను గుర్తించి అందజేయాలిదివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులకు ఇంటి వద్దకే.. 
  • కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌ : కొవిడ్‌-19 నిబంధనలు పాటిం చి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ హరిచందన సూచించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్‌ కా ర్యాలయంలో డీఆర్డీఏ, చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి ఏడాది మా దిరిగానే ఈసారి కూడా దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా నుంచి మండలాల వరకు చీరల పంపిణీకి ఏపీఎంలు బాధ్యత వహించాలన్నారు. ఆహార భద్రత, అంత్యోదయ యోజన కార్డులు ఉండి 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ చీరలను పంపిణీ చేయాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు లక్షా 60 వేల చీరలు అందుబాటులో ఉన్నాయని, వీటిని గోడౌన్లలో భద్రపరచారన్నారు. గ్రామా ల్లో కార్యదర్శులు, మహిళా సంఘం సభ్యులు, చౌకధర షాపు డీలర్లు ముగ్గురు కమిటీలుగా ఉంటారని, పట్టణాల్లో బిల్‌ కలెక్టర్‌, చౌకధర షాపు డీలర్‌ కమిటీలుగా ఉంటారని వివరించారు. కమిటీలు లబ్ధిదారులను గుర్తించి చీరలు పంపిణీ చేయాలన్నారు. 

అక్విటెన్సీ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు డీఆర్డీఏకు సమర్పించాలన్నారు. లబ్ధిదారుల సంతకం తీసుకున్న తర్వాతనే చీరలను పంపిణీ చేయాలన్నారు. మూడు నెలల నుంచి రేషన్‌ తీసుకున్న వారిని గుర్తించాలని, లబ్ధిదారులకు ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు తప్పని సరిగ్గా ఉండాలన్నారు. దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు కేం ద్రాలకు రాలేని వారిని గుర్తించి ఇంటి వద్దకు వెళ్లి చీరలను పంపిణీ చేయాలన్నారు. చిన్న గ్రామాల్లో ఒక కేంద్రం, పెద్ద గ్రామం అయితే రెండు, మూడు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ స్టాక్‌ పాయింట్లలో ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలని, పంపిణీ అనంతరం అక్విటెన్సీ పక్కాగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు,  వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

రుణాలను వెంటనే రికవరీ చేయాలి

సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీ నిధి బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను వెంటనే రికవరీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలాల వారీగా రికవరీ చేసిన రుణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలం లో ఇచ్చిన రుణాల రికవరీ పూర్తి చేయాలని, రికవరీ చేయ ని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక పెట్టుబడి నిధి నుంచి ఇచ్చిన రూ.1.0 9లక్షలు, స్త్రీ నిధి రుణాలు 91లక్షలను అక్టోబర్‌ 6వ తేదీలోగా వసూ లు చేయాలన్నారు. తీసుకున్న రుణాలు చెల్లించని మహిళా సంఘాల సభ్యులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్య లు తీసుకుంటామన్నారు.  

లక్ష్యాన్ని పూర్తి చేయాలి

నారాయణపేట రూరల్‌ : పేట జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ఉన్నత, ప్రాథమిక ఉన్నత, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌లో మునగా, నిమ్మ, కరివేపాకు, చెట్లతోపాటు తదితర మొక్కలను నాటి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలతో జూమ్‌ సమావేశంలో మాట్లాడారు. కంపౌడ్‌ వాల్‌లేని పాఠశాలలకు బయోఫెన్సింగ్‌ చేయడానికి ఎంపీడీవోలను సంప్రదించి ఏర్పాటు చేయించాలన్నారు. నేషనల్‌ డీ వార్మింగ్‌ డే సందర్భంగా వచ్చే నెల 5నుంచి 19వ తేదీ వరకు 1 నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న విద్యార్థులందరికీ ఆల్బండజోల్‌ మాత్రలను వేయించాలన్నారు. పాఠశాలల్లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ కోసం రిజిస్టర్‌ చేసుకుని విద్యార్థులు పాఠశాలకు వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించాలన్నారు. తమ పాఠశాల పరిధిలోని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈవో రవీందర్‌, డీఐవో డాక్టర్‌ శైలజా, రాజేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. 


logo