బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 29, 2020 , 06:29:53

భర్త వేధింపులతో తల్లీకూతురు ఆత్మహత్య

 భర్త వేధింపులతో   తల్లీకూతురు ఆత్మహత్య

  • భూత్పూరు మండలం   శేరిపల్లిలో ఘటన

భూత్పూర్‌ : మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్‌ జి ల్లా భూత్పూరు మండలం శేరిపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సై భాస్కర్‌రెడ్డి కథనం మేరకు.. శేరిప ల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య, విజయలక్ష్మి (35) దంపతులు. వీరికి మౌనిక (19) ఉంది. అయితే చెన్నయ్య నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన విజయలక్ష్మి, తన కూతురు మౌనికతో కలిసి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం చుట్టుపక్కల చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృ తదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.logo