సోమవారం 26 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 28, 2020 , 06:21:31

అడ‌వి ఒడిలో ఆహ్లాదం

అడ‌వి ఒడిలో ఆహ్లాదం

  • మయూరీ పార్కు.. ఇకపై కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కుగా నామకరణం
  • అక్టోబర్‌ 1 నుంచి సందర్శకులకు అనుమతి     
  • కట్టిపడేస్తున్న అందాలు, ఆకృతులు 
  • అభివృద్ధికి కృషి చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 పాలమూరు సమీపంలోని పార్కు అడవి ఒడిలో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. మయూరీ పార్కుగా ఉన్న పేరును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కుగా నామకరణం చేశారు. పార్కులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టగా.. అక్టోబర్‌ 1 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అంచలంచెలుగా పార్కు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. పార్కులో వివిధ ఆకృతులు, అందాలు కట్టిపడేస్తున్నాయి. 

- మహబూబ్‌నగర్‌ క్రైం 


  మహబూబ్‌నగర్‌ క్రైం : పాలమూరు జిల్లా కేంద్రానికి సమీంలోని అడవి ఒడిలో పార్కు ఆహ్లాదాన్ని అందిస్తున్నది. మయూరీ పార్కును కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నామకరణం చేశారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పార్కులోకి సందర్శకులను అనుమతి ఇవ్వనున్నారు. దేశంలోనే అతి పెద్దది(2 వేల ఎకరాల్లో పిక్‌నిక్‌ స్పాట్‌)గా గుర్తింపు పొందింది. ఈ పార్కులో కొండలపై నుంచి కృత్రిమ వాటర్‌ఫాల్స్‌, రెయిన్‌ ఫారెస్ట్‌, రెయిన్‌గన్లను ఏర్పాటు చేశారు. బటర్‌ఫ్లై పార్కు, రోజ్‌ గార్డెన్‌, నక్షత్ర వనం, గ్రీన్‌ పాలీహౌస్‌, కెనోపి వాక్‌,  విడిది కోసం గుడారాలు, రెండ్రోజుల పాటు ఉండేలా ప్యాకేజీ, కెనాన్‌ వాక్‌, యోగా కేంద్రం, ఓపెన్‌ జిమ్‌, చిలుకల పార్కు, ఫారెస్ట్‌ వ్యూ పాయింట్‌, చిల్డ్రన్‌ పార్కు, పర్క్యులేషన్‌ ట్యాంక్‌, మాకోవ్‌ హౌస్‌, అడల్ట్‌ అడ్వంచర్‌ జీప్‌ సైక్లింగ్‌, జీప్‌ లైన్‌, వన కుటీరంతోపాటు మరెన్నో అభివృద్ధి పనులు పార్కులో చేపట్టారు. దీంతో సందర్శకులు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తూ అందాలను వీక్షిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృషితో పార్కు అంచలంచెలుగా అభివృద్ధి చెందింది. 

ఒకటో తేదీ నుంచి అనుమతి


  అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కులోకి సందర్శకులను అనుమతినిస్తాం. సందర్శకులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు కచ్చితంగా వాడే వారికే ప్రవేశం ఉంటుంది. ప్రతిరోజు వెయ్యి మంది వరకు సందర్శకులు వస్తుంటారు. వీకెండ్‌, హాలిడేస్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సందర్శకులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. 

- ప్రత్యూష, పార్కు ఇన్‌చార్జి, మహబూబ్‌నగర్‌logo