గురువారం 29 అక్టోబర్ 2020
Mahabubnagar - Sep 27, 2020 , 07:02:54

దూద్‌ దవాఖానను 6 నెలల్లో పూర్తి చేయాలి

దూద్‌ దవాఖానను 6 నెలల్లో పూర్తి చేయాలి

  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : దూద్‌ దవాఖానను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో రూ.60లక్షల వ్యయంతో నిర్మించనున్న దూద్‌ దవాఖానకు కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపాలమూరులో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.

గతంలో ఈ ప్రాంత వాసులకు దూద్‌ దవాఖానలో వైద్య సేవలు అందేవని, అందుకే దవాఖానను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నండ్లాల్‌ పవర్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 


logo